తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పక్కా : ఎంపీ లక్ష్మణ్ - లోక్‌సభపై బీజేపీ దృష్టి
Published : Dec 28, 2023, 2:01 PM IST
MP Laxman Lok Sabha Elections 2024 :అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం అయ్యేలా అమిత్ షా దిశా నిర్దేశం చేస్తారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.
BJP Meeting Parliament Elections 2024 :ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఉందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. 70 శాతం ప్రజలు నరేంద్ర మోదీ పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం ఓటింగ్ పెంచుకున్నమని వెల్లడించారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న తెలంగాణలో ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందారని చెప్పారు. ఇదే విధంగా బీజేపీ పార్టీ ప్రజల్లోకి వెళ్లి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకుంటామంటున్న లక్ష్మణ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.