Avinash complaint to CBI ఎస్పీ రామ్‌సింగ్ పై ఎంపీ అవినాష్ ఫిర్యాదు! ఆ కోణంలో విచారణ జరిపాలని వినతి! - Viveka case news
MP Avinash Reddy complaint against SP Ramsingh: గతంలో వివేకా కేసును దర్యాప్తు చేసిన ఎస్పీ రామ్ సింగ్‌పై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి.. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఫిర్యాదు చేశారు. రామ్ సింగ్ పక్షపాత వైఖరితో దర్యాప్తు చేశారంటూ లేఖ రాశారు. రామ్ సింగ్ దర్యాప్తు చేసిన తీరును సమీక్షించాలని కోరారు. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్ ఆధారంగా అవినాష్ ఈ లేఖ రాశారు. వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను లేఖలో ప్రస్తావించారు. వివేకా రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి ఉండొచ్చనే కోణంలో విచారణ జరగలేదన్నారు. దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్ సింగ్ విచారణ జరిపారని ఆక్షేపించారు. మున్నా లాకర్లో నగదుకు సంబంధించిన వివరాలను సీబీఐకి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. విచారణలో రామ్ సింగ్ తప్పులు చేశారన్న అవినాష్‌రెడ్డి.. వాటిని సవరించాలని కోరారు. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలన్నారు.