MP Arvind on Sale of Rice by Telangana Government : 'కమీషన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం.. తక్కువ ధరకు బియ్యం అమ్మకాల యత్నం' - Arvind on rice sales in Telangana
Published : Aug 28, 2023, 8:05 PM IST
MP Arvind on Sale of Rice by Telangana Government : కనీస మద్దతు ధరకే రాష్ట్ర రైస్ మిల్లర్లు బియ్యం కొనేందుకు ముందుకు వస్తున్నా.. కమీషన్ల కోసం తక్కువ ధరకే అమ్మేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోందని.. బీజేపీ ఎంపీ అర్వింద్ (MP Arvind) ఆరోపించారు. తద్వారా రూ.4,000 కోట్లు కాజేసేందుకు ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఇప్పటికే వేలం వేసేందుకు అనుమతి ఇవ్వాలని.. కేంద్రానికి దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఈ వేలంలో రాష్ట్ర రైస్ మిల్లర్లు సైతం పాల్గొనేందుకు వీలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
MP Arvind Fire on KCR Government :మరోవైపు కేసీఆర్ ఎన్నికల్లో డబ్బు కోసమే.. బియ్యం అమ్ముతున్నారని అర్వింద్ ఆరోపించారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాలో కేటీఆర్ మునిగిపోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బియ్యం అమ్మితే.. మిల్లర్లు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. గతంలో మక్కలు సైతం ఇదే విధంగా తక్కువ ధరకు అమ్మినట్లు గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కార్ డబ్బులు దండుకోవడం తప్ప ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే నిజామాబాద్‌లో కవిత ఎక్కడ పోటీ చేసినా మూడో స్థానానికి పోవడం ఖాయమని అర్వింద్ వ్యాఖ్యానించారు.