Krithi shetty in Mancherial : మంచిర్యాలలో హీరోయిన్ కృతి శెట్టి, జబర్దస్త్ టీమ్ సందడి - చెన్నై షాపింగ్ మాల్ ఓపినింగ్
Heroine Krithi shetty in Mancherial : ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సినీ నటి కృతి శెట్టి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌ను స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి కృతి శెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్‌లో కలియ తిరుగుతూ పట్టు చీరలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. షాపింగ్ మాల్లో నాణ్యతతో కూడిన, అందరికీ అనువైన ధరల్లో వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. హీరోయిన్ను చూడటానికి యువత పెద్ద సంఖ్యలో షాపింగ్ మాల్ వద్దకు తరలివచ్చారు. ఆమెతో కలిసి ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కృతి శెట్టితో పాటు జబర్దస్త్ కమెడియన్స్ ఇమ్మాన్యుయెల్, అదిరే అభి, సద్దాం తదితరులు కార్యక్రమానికి హాజరై ప్రదర్శనలు ఇచ్చారు. తమదైన శైలిలో స్థానికులను నవ్వించారు. కృతి సైతం జబర్దస్త్ టీమ్‌తో కలిసి డాన్సులు చేసి అలరించారు.