Motkupalli Comments on Revanth Reddy : 'రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది.. రేవంత్ రెడ్డే సీఎం'
Published : Oct 23, 2023, 3:32 PM IST
Published : Oct 23, 2023, 3:32 PM IST
Motkupalli Comments on Revanth Reddy : రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు అవుతారో అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు జోస్యం చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలోని తెలంగాణలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాబోతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, పార్టీ నేతలు ఐకమత్యంగా సాగి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
Motkupalli Comments on Congress CM Candidate: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మోత్కుపల్లి పేర్కొన్నారు. కాంగ్రెస్ పగ్గాలను రేవంత్ చేపట్టిన నుంచి రాష్ట్రంలో పార్టీ పుంజుకుందని తెలిపారు. కచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మోత్కుపల్లి(Motkupalli) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. తెలంగాణ ఎన్నికలకు వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదలై.. డిసెంబర్ 3న కౌంటింగ్‌తో పూర్తి కానున్నాయి.
TAGGED:
మోత్కుపల్లి కామెంట్స్