Road accident in Mulugu district : రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడు మృతి - Road Accident in Telangana
Road accident in Mulugu district : ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తాడ్వాయి మండలం పస్రా గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీ,కుమారుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లీ, కుమారుడు ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్నారు. తాడ్వాయికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో పస్రా గ్రామం వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు వేగంగా ఢీ కోట్టడంతో తల్లీ, కుమారుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.
కన్నాయిగూడెం మండలం బట్టాయిగుడెం గ్రామానికి చెందిన సునార్కాని రమాదేవి (అంగన్వాడీ టీచర్) ఆమె కుమారుడు శ్రీనివాస్ కలిసి ములుగు కలెక్టర్ కార్యాలయానికి పని నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. తాడ్వాయి ఎస్సై చావళ్ల వెంకటేశ్వర రావు ఘటన స్థలానికి చేరుకోని ప్రమాదం గురించి ఆరా తీసి.. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగం, మూలమలుపు కావడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.