కేంద్రమంత్రి అమిత్ షా కాదు- అబద్ధాల బాద్ షా : ఎమ్మెల్సీ కవిత
Published : Nov 25, 2023, 5:10 PM IST
MLC KAVITHA ELECTION CAMPAIGN in JAGTIAL: ప్రభుత్వ సంస్థలు మూసివేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న చక్కర కర్మాగారాలను తెరిపిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పలు వార్డులలోనూ, కార్నర్ మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న చక్కెర కర్మాగారాలను మూసివేసింది బీజేపీ ఎంపీ అని ఆరోపించారు.
BRS Campaign in JAGTIAL: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఫ్యాక్టరీలను తెరిపిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీలు ఇస్తున్నారని కవిత విమర్శించారు. కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) చెప్పినవి అన్ని అబద్ధాలేనని మండిపడ్డారు. ఆయన అమిత్ షా కాదని.. అబద్ధాల బాద్ షా అని కవిత విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే వెంటనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత తమదేనన్నారు. తమ పార్టీకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మహారాష్ట్ర అభ్యర్థి సంజయ్‌ని గెలిపించాలని కవిత కోరారు.