పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పాత టెండర్లను ఎందుకు రద్దు చేస్తున్నారు : కవిత
Published : Jan 9, 2024, 7:35 PM IST
MLC Kavitha About on Palamuru Rangareddy Project : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రస్తుతం జరుగుతున్న పనులు రద్దు చేసి, రీటెండర్లు పిలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోందని, అదే నిజమైతే ఎందుకు రద్దు చేయాల్సి వస్తోందో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో సమావేశమై, మాట్లాడారు.
MLC Kavitha Press Meet in Mahbubnagar :ఇప్పటికే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన 90 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం 10 శాతం పనులు పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని అన్నారు. టెండర్లు రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలిస్తే రెండు సీజన్లు వెనక్కి వెళ్లాల్సి వస్తోందని ఆందోళన చెందారు. పాలమూరు-రంగారెడ్డికి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని వాటిని సాధిస్తే, ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కుతుందని సూచించారు. ఆ దిశగా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కోరారు. బీఆర్ఎస్ హయాంలో ఏపీ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడితే దాన్ని అడ్డుకున్నది కేసీఆర్నేనని, ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.