Jeevan Reddy Fires on KCR : 'ఆర్నెళ్లలో కేసీఆర్ తెలంగాణను అమ్మేస్తారు'
Jeevan Reddy Fires on CM KCR : రాష్ట్రంలో 111జీవో రద్దుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునేందుకే 111 జీవో రద్దు చేశారని విమర్శించారు. 111 జీవోపై వేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో నేత వందల ఎకరాల భూమి కొంటున్నారని ఆరోపించారు.
ముందుగానే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి 111 జీవో రద్దు చేశారని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. 111 జీవో పరిధిలోని భూముల క్రయవిక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్నెళ్లలో తెలంగాణను అమ్ముకుని పోవటమే లక్ష్యంగా కేసీఆర్ ఆలోచన ఉందని.. ఇందులో భాగంగానే 'ట్రిపుల్ - వన్' జీవో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. 'ట్రిపుల్ వన్' పరిధిలోని రైతుల భూములన్నీ వ్యాపారవేత్తలు, బీఆర్ఎస్ నేతలు తమ చేతుల్లోకి తీసుకున్నారని వారికి మేలు చేసేందుకే ఈ జీవో రద్దు చేశారని తెలిపారు. చెరువులన్నీ కబ్జా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్న జీవన్‌రెడ్డి.. హైదరాబాద్ జంట జలాశయాలను ఏ విధంగా కాపాడతారో చెప్పాలన్నారు.