MLA Raja Singh Fires On BRS MLAs : ఏ వేదికపై ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ శిక్షణ ఇవ్వాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ - Hyderabad latest political information
Published : Sep 2, 2023, 9:22 PM IST
MLA Raja Singh Fires On BRS MLAs : జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమాలను అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాజకీయ వేదికలుగా వాడుకున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తనకు ఆహ్వానం వస్తే కొల్లూరులో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా జరిగిన రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లానని తెలిపారు. కానీ, ఆ బహిరంగ సభలో బీజేపీని విమర్శించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారంటూ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ సహా ఇతర ఎమ్మెల్యేలకు ఏ వేదికపై ఏం మాట్లాడాలో కూడా తెలియదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏ ప్రదేశంలో ఏం మాట్లాడాలో కూడా తెలియని ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ నిండిపోయిందని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో బీఆర్ఎస్ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి తర్ఫీదు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు సూచిస్తున్నానన్నారు.