MLA Mutthireddy Fires On MLC Palla Rajeswerreddy : 'పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి' - MLC Palla Rajeswerreddy
Published : Aug 26, 2023, 5:16 PM IST
MLA Mutthireddy Fires On MLC Palla Rajeswerreddy : వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి మాట్లాడకుండా చేస్తున్నారన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఆయన వెనుకకు తీసుకొని.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అస్థిరత్వం కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వక్రీకరించి మాట్లాడడం సరైనది కాదని.. డబ్బు మదంతో అమాయమైన నాయకులను కొనుగోలు చేయడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్ నిర్వహించిన దివ్యాంగుల ఆసరా ఫించన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్కు అన్ని విషయాలు తెలుసని.. సరైన నిర్ణయం తీసుకొని అవకాశం తప్పకుండా ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి భారీ మెజార్టీతో గెలిచి తీరుతామని కార్యకర్తలకు భరోసా కల్పించారు.