MLA Muthireddy and his Daughter Controversy : 'నా తండ్రికి రూ.వేల కోట్ల ఆస్తులున్నాయ్.. ఇలా చేయడం తప్పు'
MLA Muthireddy Daughter Controversy : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో తన పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన భూమిని మున్సిపాలిటీకి ఇస్తానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 1200 గజాల భూమి చుట్టూ ఉన్న ప్రహరీని ఆమె తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కీలక వ్యాఖ్యలు చేశారు. 'మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి స్థలంలోని 1,270 గజాల భూమిని మా నాన్న నా పేరు మీద రాశారు. ఎమ్మెల్యే అయి ఉండి మా నాన్న ఇలాంటి పని చేసి ఉండకూడదు. నా పేరుపై ఉన్న ఈ భూమిని తిరిగి మున్సిపాలిటీకి అప్పగించేస్తా. చేర్యాల మున్సిపాలిటీకి స్థలం రిజిస్ట్రేషన్ చేస్తా. ఎమ్మెల్యే.. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం తప్పు. భూమిని కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసి కలెక్టర్ గారికి అప్పగిస్తా. చేర్యాల ప్రజలు క్షమించాలి' అని తుల్జా భవానీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో.. భూమిని తన పేరిట ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారంటూ తండ్రి యాదగిరిని భవానీ బహిరంగంగా నిలదీయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
TAGGED:
telangana latest news