తెలంగాణ

telangana

MLA Kadiam Srihari Fires on Congress Party

ETV Bharat / videos

కాంగ్రెస్ ​ప్రభుత్వం ఆ హామీలపై శాసనసభ సాక్షిగా మాట మార్చింది : కడియం శ్రీహరి - కాంగ్రెస్​ గ్యారంటీలపై కడియం శ్రీహరి సీరియస్

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 4:12 PM IST

MLA Kadiam Srihari Fires on Congress Party : కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో ప్రకటించిన ఆరు గ్యారంటీలను విస్మరిస్తోందని బీఆర్​ఎస్​ స్టేషన్​ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద మాట్లాడిన ఆయన అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లో ప్రియాంక గాంధీ పాల్గొన్న సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారని, అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నిండు సభలో నిరుద్యోగ భృతి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట రుణాలు తీసుకోని వాళ్లు బ్యాంకులకు వెళ్లి రూ.రెండు లక్షలు తీసుకొమ్మని రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పారని, అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రతి క్వింటాల్​కు మద్దతు ధరతో పాటు రూ.5 వందలు బోనస్ ఇస్తామన్నారన్నారు. ఇచ్చిన హామీలను ఇవ్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటుందని దుయ్యబట్టారు. దీనిని బీఆర్​ఎస్​ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 

ABOUT THE AUTHOR

...view details