తెలంగాణ

telangana

ETV Bharat / videos

టోల్‌ సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి - తెలంగాణ వార్తలు

By

Published : Jan 4, 2023, 10:15 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

MLA Chinnaiah Attacks Toll Plaza Staff : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీరు వివాదస్పదమైంది. ఓ టోల్‌ప్లాజా వద్ద అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై ఆయన చేయిచేసుకున్నారు. నిన్న రాత్రి మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి వైపు వెళ్లే 363 జాతీయ రహదారిపై వారం క్రితం టోల్‌ప్లాజాను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తికాకపోవటం, ఇతర రాష్ట్రాలకు చెందిన సిబ్బంది ఇక్కడ పనిచేస్తుండగా, ఇటీవల ఇక్కడ తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఎమ్మెల్యే చిన్నయ్య నియోజకవర్గానికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో సిబ్బంది వాహనం ఆపటంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కారు దిగిన ఎమ్మెల్యే, టోల్‌ప్లాజా వద్ద పనిచేస్తున్న ఓ వ్యక్తి చెంపపై కొట్టారు. ఈ ఘటన అక్కడి సీసీకెమెరాల్లో రికార్డు కాగా, బయటికి వచ్చిన వీడియోలు వైరల్‌గా మారాయి. టోల్‌ప్లాజా వద్ద అంబులెన్స్‌ వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్యే ప్రశ్నించగా, అక్కడి సిబ్బంది దురుసుగా మాట్లాడినట్లు చిన్నయ్య అనుచరులు చెబుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details