నా విజయానికి విశ్రాంత ఉద్యోగుల కృషి మరవలేనిది : మంత్రి తుమ్మల - తుమ్మల నాగేశ్వరరావు
Published : Dec 30, 2023, 7:33 PM IST
Minister Tummala about Retired Employees : ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని రాష్ట్ర వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెన్షనర్స్ దైనందిన కాలమానిని ఆవిష్కరించారు.
Minister Tummala Nageswara Rao Reveals Calendar: ఎంతో నమ్మకంతో విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వాన్ని మార్చారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో విశ్రాంత ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషించారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిందని ఆరోపించారు. కొంచం ఆలస్యమైనా, మంచి బడ్జెట్‌ను రూపొందించుకుని అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు. తన విజయానికి విశ్రాంత ఉద్యోగుల కృషి మరవలేనిదన్నారు. తాను ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు.