నిలోఫర్ కేఫ్‌లో సందడి చేసిన కేటీఆర్ - కేటీఆర్ ఎన్నికల ప్రచారం
Published : Nov 14, 2023, 7:14 PM IST
Minister Ktr Visit Niloufer Cafe : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ బీజీగా ఉన్న మంత్రి కేటీఆర్ (KTR) నీలోఫర్ కేఫ్‌లో సందడి చేశారు. ఓ ఇంటర్వ్యూ కోసం బంజారాహిల్స్‌లోని నీలోఫర్ కేఫ్‌కు వెళ్లిన కేటీఆర్.. అక్కడున్న వారిని పలకరించారు. వారితో కలిసి చాయ్ తాగుతూ సరదాగా మాట్లాడారు. చిన్నారిని ఎత్తుకుని ఆడించారు. ఈ క్రమంలో కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. రాష్ట్రాభివృద్ధి, హైదరాబాద్‌లో పరిస్థితులు, తమ స్వరాష్ట్రాల స్థితిగతులను అక్కడున్న వారు కేటీఆర్ తో పంచుకున్నారు.
కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. అలాగే మంత్రి కేటీఆర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న బీఆర్ఎస్ సభలకు వెళుతూ.. రోడ్ షోలలో పాల్గొంటున్నారు. ఈ రోజు చిట్యాలలో రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్.. అనంతరం ఎల్బీనగర్ వద్ద నాగోల్‌లో తెలంగాణ టెక్స్టైల్ హ్యాండ్లూమ్ కార్మికుల సదస్సులో పాల్గొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకున్న, తీసుకోబోయే చర్యల గురించి వివరించారు.