మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధు కటాఫ్‌ను పరిశీలిస్తాం : కేటీఆర్ - కేటీఆర్ ఆన్ రైతుబంధు
Published : Nov 8, 2023, 4:16 PM IST
Minister KTR on Rythu Bandu Amount : రైతుబంధు పథకంపై మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతులకు ఇచ్చే రైతుబంధు(RYTHU BANDU) కటాఫ్ విషయంలో పరిశీలన చేస్తామని అన్నారు. రాష్ట్రంలో రైతులకు తక్కువ భూమి ఉన్న అన్నదాతలకు తక్కువ.. ఎక్కువ భూమి ఉన్న వారికి అధికంగా డబ్బులు వస్తున్నాయని గుర్తు చేశారు. దీనివల్ల కొంత మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గమనించామని తెలిపారు. మళ్లీ తాము అధికారంలోకి రాగానే ఈ అంశంపై పరిశీలన చేస్తామని హైదరాబాద్‌లో పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలిపారు.
Minister KTR on Rythu Bandu : రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. అప్పు తీసుకొచ్చి ఇరిగేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, పవర్ లాంటి వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వం పెడుతోందని పేర్కొన్నారు. మోదీ(PM MODI) 118 కోట్లు అప్పు చేశారని విమర్శించారు. బీజేపీతో స్థానిక ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయలేదని తెలిపారు.