తెలంగాణ

telangana

Minister KTR

ETV Bharat / videos

KTR comments at Kongarakalan : 'ప్రభుత్వ ఉద్యోగాలు 2 శాతమే ఉంటాయి.. అందరికీ రావడం అసాధ్యం' - కొంగరకలాన్‌ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగం

By

Published : May 15, 2023, 4:03 PM IST

KTR On Foxconn company foundation stone : రాష్ట్ర అభివృద్ధికి, యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్‌ గ్రామంలో ఫాక్స్‌కాన్‌ సంస్థకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన కేటీఆర్​.. ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకరు మన రాష్ట్రం నుంచే ఉన్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలో విఫలమైందన్నారు. 'రైతుల కన్నీళ్లు తుడవని ప్రభుత్వం కావాలా? లేదా కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ము కాసే ప్రభుత్వాలు కావాలా' అని ప్రజలను ప్రశ్నించారు. ఫాక్స్‌కాన్ సంస్థ పూర్తయితే 35 నుంచి 40 వేల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. మరో ఐదేళ్లలో కొంగర కలాన్ పరిసరాల రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. ఏడాదిలోగా ఫాక్స్​కాన్​ కంపెనీ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ ఏర్పాడిన తరువాత రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఫాక్స్‌కాన్‌దే అని ప్రకటించారు. 

ABOUT THE AUTHOR

...view details