తెలంగాణ

telangana

Minister Konda Surekha on Parliament Elections

ETV Bharat / videos

లోక్​సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్​కే అనుకూలం : కొండా సురేఖ - Konda Surekha reacts to the Medaram jathara

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 5:00 PM IST

Minister Konda Surekha on Parliament Elections : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందని దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా తీర్పు మరోసారి కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అప్పులు చేసి ఉద్యోగులకు కనీసం జీతాలు సక్రమంగా ఇవ్వలేని బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామనడంలో అర్ధం లేదని చెప్పారు. 

Konda Surekha on Medaram Jathara : మేనిఫెస్టోలో ఏదైతే తాము చెప్పామో అది తప్పకుండా చేస్తామని ప్రజలకూ ఆ విశ్వాసం ఉందని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తమ తీరు మార్చుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని ఇదే ప్రజా సమస్యలపై ఆయనకు గల చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తాము తప్ప ప్రతిపక్షాలపై కక్షసాధింపు ధోరణి ఉండదని ప్రజలు చాలా ఏళ్ల తరువాత అసెంబ్లీ కార్యక్రమాలను ఉత్సాహంగా వీక్షించారన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం కేటాయించిన 75 కోట్లు సరిపోకపోతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మేడారం జాతరతోపాటు కొమరవెల్లి, ఐనవోలు జాతరల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే తాము సేవకులమని సేవకులుగానే పనిచేసి ప్రజల మెప్పు పొందుతామంటున్న కొండా సురేఖతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details