కార్మికులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది : హరీశ్‌రావు
Published : Nov 14, 2023, 9:54 PM IST
Minister Harish Rao Comments on Congress Party : కాంగ్రెస్ హయాంలో కార్మికులు వేతనాలు పెంచాలని కోరితే గుర్రాలతో తొక్కించి, ముళ్ల కంపలతో అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన కార్మిక, ఉద్యోగ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకు పడిన హరీశ్‌రావు.. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్ఎసీ ఇచ్చినట్లుగా.. కార్మికులకు కూడా పీఆర్సీ అమలు చేస్తామని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు కార్మికులను గానీ, చిరు ఉద్యోగులను గానీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.
నాడు ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు.. తమ వేతనాలు పెంచాలని హైదరాబాద్‌కు వస్తే క్రూరంగా దాడికి దిగిన చరిత్ర కాంగ్రెస పార్టీదని విమర్శించారు. మహిళలను కూడా చూడకుండా అర్థరాత్రి వరకు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిన దౌర్భాగ్య స్థితిని నాడు కాంగ్రెస్ హయాంలో చూశామన్నారు. అటువంటి స్థితి నుంచి ఎన్నో విప్లవాత్మక మార్పులకు తెరలేపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆటో డ్రైవర్లకు సైతం మూడు నెలలకు ఉండే త్రైమాసిక ట్యాక్స్‌ను సైతం రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని హరీశ్‌రావు అన్నారు.
TAGGED:
Hyderabad Latest News