Medak SP Office Drone Visuals : శ్వేతవర్ణంలో మెదక్ జిల్లా ఎస్పీ ఆఫీస్.. డ్రోన్ విజువల్స్ అదిరిపోయాయిగా - టుడే తెలంగాణ వార్తలు
Published : Aug 23, 2023, 2:06 PM IST
Medak SP Office Drone Visuals : మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం సహా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. అనంతరం ప్రగతి నివేదన సభలో ప్రసంగించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రాక కోసం మెదక్ పట్టణ మంతా ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీ మయంమైంది. సీఎం చేతుల మీదుగా ప్రారంభంకానున్న జిల్లా పోలీసు నూతన భవన సముదాయం ప్రారంభోత్సవానికి అంగరంగవైభవంగా ముస్తాబైంది.
CM KCR Medak Tour Today : మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయం శ్వేతవర్ణంతో తేజోమయంగా మెరుస్తూ.. వీక్షకులు కళ్లు తిప్పుకోలేనంతగా సుందరంగా రూపుదిద్దుకుంది. ఈ తరుణంలో తీసిన డ్రోన్ విజువల్స్ చూపరులను అబ్బుర పరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. బుధవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి సమీక్షిస్తున్నారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఐజీ రమేశ్ నాయుడు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.