తొమ్మిది మందిని చంపిన పులి.. గురిచూసి మట్టుబెట్టిన షార్ప్ షూటర్లు! - మనుషుల చంపిన పులి హత్య
బిహార్‌లో మనుషుల రక్తానికి రుచి మరిగిన పెద్దపులిని ఎట్టకేలకు షార్ప్ షూటర్లు మట్టుబెట్టారు. చంపారన్ జిల్లాలోని బగాహ అనే గ్రామంపై పులి దాడి గ్రామస్థులను చంపుతోంది. ఇప్పటివరకు 9 మందిని పొట్టనపెట్టుకుంది. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కొన్నివారాల నుంచి పులిని బంధించేందుకు ఏనుగులతో గాలించినా జాడ కనిపించలేదని అటవీ సిబ్బంది తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే నలుగురిని చంపినట్లు చెప్పారు. బిహార్ ప్రభుత్వం అనుమతి తీసుకొని షార్ప్ షూటర్లతో పులిని చంపినట్లు అటవీ సిబ్బంది వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST