తెలంగాణ

telangana

ETV Bharat / videos

డ్యాన్​ చేస్తుండగా గుండెపోటు సెకన్లలోనే మృత్యు ఒడిలోకి - పెళ్లిలో గుండెపోటుతో మృతి

By

Published : Nov 29, 2022, 8:46 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్​ చేస్తుండగా గుండెపోటు రావడం వల్ల ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తన మేనల్లుడి పెళ్లిలో పాల్గొనడానికి మనోజ్​ అనే వ్యక్తి వారణాసి నుంచి మండీవాడీహ్​ అనే ప్రాంతానికి వచ్చాడు. వరుడి బంధువులు ఊరేగింపులో భాగంగా డప్పు వాయిద్యాలతో డ్యాన్స్​లు వేస్తూ లఖ్​నవూకు బయలుదేరారు. అయితే డ్యాన్స్​ చేస్తున్న సమయంలో మనోజ్​కు గుండెపోటు రాగా​ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే బంధువులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. కేవలం 5 సెకండ్లలోనే ఈ విషాదం జరిగిందని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details