కాంగ్రెస్ ప్రజస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనం : మల్లు రవి - పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తాజా వార్తలు
Published : Dec 8, 2023, 3:32 PM IST
Mallu Ravi Interview on Prajadarbar :తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి భారీగా ప్రజలు కదిలి వచ్చారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ప్రజలకు జవాబుదారిగా ఉండడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.
CM Revanth Reddy Prajadarbar :రాష్ట్రంలో పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌కు ప్రజలంతా తరలి వచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రజస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనమని.. ఇకపై ప్రతిరోజూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని మల్లు రవి వెల్లడించారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కారిస్తారని తెలిపారు. ధరణి సంబంధిత దరఖాస్తులు పెద్ద మొత్తంలో వచ్చాయని పేర్కొన్నారు. ఎన్ని వేల దరఖాస్తులు వచ్చిన ప్రజల నుంచి స్వీకరించి వాటిని పరిష్కారిస్తామన్న పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవితో ముఖాముఖి.