తెలంగాణ

telangana

Makers of Milkshakes

ETV Bharat / videos

Makers of Milkshake Founder Rahul Inspirational Story : సాఫ్ట్‌వేర్‌కు స్వస్తి.. వ్యాపారంతో దోస్తీ - Inspirational story owner of Makers of Milkshake

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 8:13 PM IST

Makers of Milkshake Founder Rahul Inspirational Story : బీటెక్‌ పూర్తి చేశావు..! నెక్ట్‌ ఏంటని అందరు అడుగుతుంటే.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాడు. కానీ ఇష్టంలేని పని కావడంతో స్వస్తి చెప్పాడు. అది మానేసి లండన్ వెళ్లి సండర్లాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తిచేశారు. అక్కడ చదువుతున్నప్పుడే ఒక వ్యాపారం అతడిని బాగా ఆకట్టుకుంది. ఈ వ్యాపారం కచ్చితంగా కలిసి వస్తుందని నమ్మాడు. బావ సక్సెస్‌ జర్నీనే స్ఫూర్తిగా తీసుకుని.. వ్యాపారం ఆలోచన చేశాడు. వినూత్నఐడియాతో మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్‌ (Makers of Milkshake) ప్రారంభించాడు సూర్యాపేట జిల్లాకు చెందిన రాహుల్‌. ఎదురైనా కష్టనష్టాలను అధిగమించి.. ఓర్పుతో ముందుకెళ్లాడు. 

Makers of Milkshake Business : ఫలితంగా ఆ సంస్థ లాభాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు దుబాయ్, అమెరికా సహా 45 శాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అవసరమైన సమయాల్లో ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తూ పెద్దమనసు చాటుకుంటున్నాడు. అయితే అతడు మిల్క్‌షేక్‌ వ్యాపారమే ఎందుకు చేయాలనుకున్నాడు..? ఎదురైన ఇబ్బందులేంటి..? వాటన్నింటిని అధిగమించి సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న రాహుల్‌ జర్నీని అతడి మాటల్లోనే విందాం.

ABOUT THE AUTHOR

...view details