Lokesh to approach Supreme Court on Chandrababu case : 'స్కిల్' కేసులో దిల్లీ వేదికగా లోకేశ్ న్యాయపోరాటం..! సుప్రీంను ఆశ్రయించనున్న టీడీపీ - Skill Develpoment Case Updates
Published : Sep 22, 2023, 7:48 PM IST
Lokesh to approach Supreme Court on Chandrababu case ; టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలుగుదేశం నిర్ణయించింది. సుప్రీం కోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు దిల్లీలోనే ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్ణయించుకున్నారు. న్యాయవాదులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న లోకేశ్.. వాస్తవానికి ఈ రోజు సాయంత్రం రాజమండ్రికి తిరిగి రావాలనుకున్నారు. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడం, పరిణామాలు మారిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు న్యాయవాదులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. సుప్రీం కోర్టులో వేయాల్సిన పిటిషన్, తదితర అంశాలపై న్యాయవాదులతో లోకేశ్ చర్చిస్తున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్లో ఉంటున్న టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు విచారణ కీలక దశలో క్వాష్ పిటిషన్ విచారణ అనుమతించలేమని, సీఐడీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది. ఈ సందర్భంగా నిహారిక ఇన్ ఫ్రాస్ర్టక్చర్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని హైకోర్టు ఉటంకించింది.