Financial Trader Kidnapping video : పట్టపగలే మేడ్చల్‌లో వ్యాపారి కిడ్నాప్ యత్నం.. వీడియో వైరల్ - Kidnapping viral videos
Financial trader kidnapping attempt in Medchal : మేడ్చల్ జిల్లాలో ఓ ఫైనాన్షియల్ వ్యాపారి కిడ్నాప్ యత్నం కలకలం స్పష్టించింది. పీర్జాదిగూడ నగర పాలక సంస్థకు చెందిన ఫైనాన్షియల్ వ్యాపారి అవినాష్ రెడ్డిని కొందరు కిడ్నాప్‌కు యత్నించారు. బాధితుడు కథనం ప్రకారం.. తన చిన్ననాటి స్నేహితురాలు.. ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తోన్న ఓ మహిళతో అవినాష్‌రెడ్డికి పరిచయం ఉంది. కొద్ది నెలలు క్రితం అవినాష్ రెడ్డి నుంచి సదరు మహిళ రూ.25 లక్షలు అప్పు తీసుకుంది. ఆ తరువాత అవినాష్ రెడ్డికి.. ఆమె దూరంగా ఉంటుంది. డబ్బులు అడిగితే సమాధానం రావడం లేదు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి డబ్బుల విషయం మాట్లాడుదామని ఘట్ కేసర్లో ఉన్న ఓ హోటల్ వద్దకు రమన్నాడు. ఆ తరువాత కారులో కూర్చోబెట్టుకొని కీసjర వైపు వెళ్లారు. ఆ మహిళను తాను పెళ్లి చేసుకున్నాని.. ఆమెకు సంబంధించి ఫొటోలు, వీడియోలు ఉంటే ఇచ్చేయమని బెదిరించాడు. అప్పుగా తీసుకున్న డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో భయపడిపోయిన అవినాష్ రెడ్డి తన ఫోన్‌తో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఘట్ కేసర్ పోలీసులు.. చక్రధర్ గౌడ్‌తో పాటు మరో ముగ్గురుపై కిడ్నాప్ యత్నం కేసు నమోదు చేశారు.