పొలంలో చిరుత హల్చల్- 3గంటలకుపైగా శ్రమించి బంధించిన అధికారులు - చిరుతపులి వీడియో
Published : Dec 31, 2023, 9:54 AM IST
|Updated : Dec 31, 2023, 11:32 AM IST
Leopard Viral Video :గ్రామంలోనిపొలంలో హల్చల్ చేసిన 70 కిలోల చిరుతపులిని మూడున్నర గంటలపాటు తీవ్రంగా శ్రమించి బంధించారు అటవీశాఖ అధికారులు. ఆ తర్వాత దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుర్ జిల్లాలోని జరిగిందీ ఘటన.
జిల్లాలోని పర్పా గ్రామ పొలంలో చిరుతపులిని ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు గ్రామస్థులు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కొద్ది నిమిషాల్లోనే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. పది మంది అధికారులు కలిసి చిరుతను బంధించేందుకు మూడన్నర గంటలాపాటు శ్రమించారు.
అయితే రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా పొలం వద్ద చేరుకున్న ప్రజలు, అధికారులను చూసిన చిరుత భయపడి పొదల్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో పెద్ద వల వేసిన అధికారులు చిరుతను బంధించారు. పట్టుబడిన చిరుతపులి బరువు 50 నుంచి 70 కిలోల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో చిరుతతోపాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. చిరుతపులిని పట్టుకోవడం వల్ల గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.