తెలంగాణ

telangana

We Makes Scholars

ETV Bharat / videos

Foreign Education: 'స్టడీ ఇండియా పేరుతో విదేశీ విద్యను అభ్యసించే వారికి రుణాలు'

By

Published : Apr 19, 2023, 4:27 PM IST

We Makes Scholars In Hyderabad: విదేశీ విద్యకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. కానీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విద్య అభ్యసించాలంటే ఆర్థిక భారం ఎక్కువే. లక్షల రూపాయలు ఉంటే కానీ చదువు పూర్తిచేయలేం. అయితే పేరున్న యూనివర్సిటీల్లో రూ.కోటి వరకు కూడా అవుతోంది. ప్రతిభ ఉన్నా కూడా.. ఆర్థిక ఇబ్బందులతో ఎందరో విద్యార్థులు విదేశీ విద్యకు దూరం అవుతున్నారు. ఇటూ బ్యాంకుల దగ్గరకు వెళ్లినా ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి వారి ఇబ్బందులు తీర్చేందుకు కేరళకు చెందిన అర్జున్​, యామిని అనే ఇద్దరు.. వీ మేక్స్ స్కాలర్ పేరుతో విదేశీ విద్యార్థులకు రుణాలు అందించే స్టార్టప్​ను హైదరాబాద్​లో ప్రారంభించారు. 

డిజిటల్ ఇండియాలో భాగంగా ఇక్కడి నుంచే దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి విదేశీ విద్యకు రుణాలు అందిస్తూ.. ఎందరో విదేశీ విద్య కళలను సాకారం చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలోని 40 వేలకు పైగా యవతకు విదేశీ విద్యకు రుణాలు అందించారు. స్టడీ ఇండియా పేరుతో దేశంలో విద్యను అభ్యసించే వారికి రుణాలు ఇస్తున్నామని వారు చెప్తున్నారు. ప్రతిభ ఉన్న ఏ ఒక్కరు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు తాము ఈ స్టార్టప్ ప్రారంభించామని చెబుతున్న వీ మేక్స్ స్కాలర్ కో ఫౌండర్ అర్జున్​తో ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details