తెలంగాణ

telangana

KTR tour in kamareddy

ETV Bharat / videos

KTR Tour in Kamareddy : కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన - ktr latest updates

By

Published : Aug 14, 2023, 4:22 PM IST

KTR Tour in Kamareddy : కామారెడ్డిని మున్సిపల్ నుంచి జిల్లాగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలో 28 కోట్ల రూపాయలతో నిర్మించిన పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గోవర్ధన్.. కామారెడ్డిని అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నారని కేటీఆర్ తెలిపారు. నరసన్నపల్లి గ్రామ శివారులోని 44 వ జాతీయ రహదారి వద్ద 81లక్షలతో నిర్మించిన స్వాగత తోరణం, ఈఎస్అర్ గార్డెన్స్ నుండి టేక్రియాల్ వరకు 11 కోట్ల రూపాయలతో ఆరు లైన్ల రోడ్డును ప్రారంభించారు. ఏఎస్ఆర్ గార్డెన్ నుంచి కళాభారతి వరకు 2.45 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్​ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కామారెడ్డి అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధుల నుండి మరో 45 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ‌ కార్యక్రమలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details