తెలంగాణ

telangana

Kailash Cave Ellora Replica

ETV Bharat / videos

Kailash Cave Ellora Replica : కెనడాలో 'కైలాసం'.. గణేశ్ మండపానికి ఫారెనర్స్​ క్యూ!

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 6:27 PM IST

Kailash Cave Ellora Replica :కెనడాలో ప్రఖ్యాత ఎల్లోరా కైలాశ్​ గుహ నమూనాలో గణేశ్​ మండపాన్ని ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్​ దంపతులు. సుమారు నాలుగు నెలల పాటు శ్రమించి.. ఈ నమూనాను రూపొందించారు. దీనిని చూడడానికి భారతీయులతో పాటు కెనడా దేశస్థులు సైతం వస్తున్నారని దంపతులు చెబుతున్నారు.

ఇందోర్​కు చెందిన అభిషేక్ పాఠక్​, స్నేహల్ పాఠక్​ దంపతులు కెనడాలో నివసిస్తున్నారు. అభిషేక్​ ఇంజినీర్​గా పనిచేస్తుండగా.. స్నేహల్​ మార్కెటింగ్ కోఆర్డినేటర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. వినాయక చవితిని వినూత్నంగా నిర్వహించాలని భావించిన దంపతులు.. ఎల్లోరాలోని కైలాశ్ గుహ నమూనాను మండపంగా చేశారు. దీని ఏర్పాటు కోసం జూన్​ నుంచే సన్నాహాలు చేపట్టారు. దాదాపు నాలుగు నెలల శ్రమించి.. కైలాశ్ గుహ నమూనాను రూపొందించారు. దీని తయారీకి అట్టలు, టీవీ డబ్బాలు, థర్మకోల్​, టిష్యూ పేపర్లను ఉపయోగించారు. కైలాశ్ గుహకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను చూసి దీనిని చెక్కారు. వినాయక చవితి వేడకులను వినూత్నంగా చేస్తూ.. దేశంలోని ప్రఖ్యాత ప్రదేశాలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఇలా చేశామని తెలిపారు పాఠక్ దంపతులు. 2021లో తిలక్ వాడ, 2022లో నర్మదా ఘాట్​ నమూనాను రూపొందించామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details