Jagadish Reddy Fire on Revanth Reddy : "రేవంత్‌రెడ్డికి అమరవీరుల స్తూపం వద్ద చర్చించే అర్హత లేదు" - Jagadish Reedy React on Revanth Reddy Comments
Jagadish Reddy Fire on Revanth Reddy : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై చేసిన విమర్శలపై బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. రేవంత్ వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది ప్రజలకు పిండాలు, తద్దినాలు పెట్టిన చరిత్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఉందన్నారు. అందుకే ఆ పార్టీల నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌కు పిండం పెడతామని మాట్లాడుతున్నాడని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(MinisterJagadish Reddy) విమర్శించారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని సమర్థిస్తూ వచ్చిన రేవంత్‌రెడ్డికి అమరవీరుల స్తూపం వద్ద చర్చించే అర్హత లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ప్రజాగాయకుడు గద్దర్ ఆశయాలు, లక్ష్యాలు నెరవేర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్దే అని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో కొంత కాలంగా గద్దర్ ఉద్యమాలు చేయలేదని చెప్పారు. మిగిలిన ఆయన ఆశయాలను ఎప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని వెల్లడించారు. గద్దర్ పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీపైనే అని గుర్తు చేశారు.