తెలంగాణ

telangana

IT employees protest in Chennai

ETV Bharat / videos

IT Employees Protest in Chennai చెన్నైలో ఐటీ ఉద్యోగుల నిరసనలు.. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ ఆందోళనలు - ఐటీ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 5:32 PM IST

IT Employees Protest in Chennai: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ... చెన్నైలో తెలుగుదేశం అభిమానులు, ఐటీ ఉద్యోగులు కదం తొక్కారు. బాబుకు అవినీతి మరక అంటించేందుకే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఏపీని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏపీలో ఉపాధి అవకాశాలు లేకనే తాము ఇతర రాష్ట్రాల్లో బతకాల్సి వస్తుందని ఐటీ ఉద్యోగులు (IT employees)  ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ భవిష్యత్తు, రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. విజనరీ నేత బాబును విడుదల చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. బాబును విడుదల చేయాలంటూ సంతకాల ఉద్యమం చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ప్లకార్డులను చేతబూని వి ఆర్‍ విత్‍ సీబీఎన్‍ అంటూ నినదించారు. 
 

తమ పిల్లల భవిష్యత్తు, రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నట్లు ఐటీ ఉద్యోగులు వెల్లడించారు. చంద్రబాబును విడుదల చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ఏపీకి అనేక పరిశ్రమలు వస్తాయని.. ఏపీలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని  ఐటీ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల జీవితాలను సీఎం జగన్‌ నాశనం చేస్తున్నారని  ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. చంద్రబాబు ముందుచూపు వల్లే తమలాంటి వారికి  ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజల్లో ఉండాల్సిన నాయకుడిని జైలులో పెట్టారని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో మళ్లీ చంద్రబాబు(Chandrababu) సీఎం కావాలంటూ నినాధాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details