Interview With Tennis Player Myneni Saketh Sai: 12 ఏళ్లకే టెన్నిస్ చేతపట్టి.. ఏషియన్ గేమ్స్‌లో సత్తాచాటిన తెలుగుతేజం - tennis player Saket
Published : Oct 8, 2023, 1:09 PM IST
Interview With Tennis Player Myneni Saketh Sai:తండ్రి ఆడటం చూసి 12 ఏళ్లకే టెన్నిస్ రాకెట్ చేతబట్టాడు. అలా సరదాగా టెన్నిస్ ఆడడం ప్రారంభించి ఏడాదికే విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విన్నర్ ట్రోఫీ అందుకున్నాడు. కెరీర్‌లో ముందుకెళ్లాడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డువచ్చినా.. తన ప్రతిభ, నైపుణ్యాలను పలువురికి నేర్పించి పారితోషికం అందుకున్నాడు.. నిలబడ్డాడు. ఫలితంగా సానియా మీర్జా (Sania Mirza) లాంటి ఫేమస్ క్రీడాకారిణితో సైతం జతకట్టి పలు పోటీల్లో సత్తాచాటాడు.
ప్రస్తుతం హాంగ్‌జౌలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ (Asian Games) పురుషుల డబుల్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాల నుంచి అభినందనలు అందుకున్నాడు. ఇలా ఏషియన్ గేమ్స్‌లో పతకం గెలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన సొంత ఖర్చులతో గల్లీ నుంచి చైనా వరకు వెళ్లిన టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ సక్సెస్ సీక్రెట్స్ ఏమిటో అతడి మాటల్లోనే విందాం.