Interview with Ponguleti Srinivas Reddy : 'కేటీఆర్ వ్యాఖ్యలకు.. ఎన్నికల్లో సమాధానం చెబుతాను' - Congress meeting in Khammam
Interview with Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌ను గద్దె దింపి.. ఇంటికి సాగనంపే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సుమారు ఆరు నెలల పాటు అనేక రకాలుగా రాజకీయంగా మేథోమథనం చేసి పలు రకాలుగా సర్వేలు చేయించి.. చివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జూలై 2న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకుంటానని వెల్లడించారు. ఖమ్మం వేదికగా నిర్వహించే ప్రజాగర్జన బహిరంగ సభకు కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాదిగా జనం పోటెత్తుతారని ధీమా వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి నిర్వహించిన సభను తలదన్నేలా బహిరంగ సభ ఉండబోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు, వర్గాలకు తావులేకుండా నేతలంతా ఒక్కటమవుతున్నామని.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌ను నడిపిస్తామన్నారు. బీఆర్ఎస్లో స్థానంలేకనే పార్టీ నుంచి వెళ్లిపోయారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు.. ఎన్నికల్లో కచ్చితంగా సమాధానం చెప్పి తీరుతామన్నారు.