Childcare Tips in Summer : 'చిన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి' - వేసవికాలంలో వడదెబ్బ లక్షణాలు
Childcare Tips in Summer : భానుడు భగభగలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఓవైపు సూర్యతాపం.. మరోవైపు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. నిప్పుల కొలిమిలా మారిన ఎండలతో పెద్ద వాళ్లే తట్టుకోలేకపోతున్నారు. ఇక వృద్ధులు, చిన్న పిల్లల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎండాకాలంలో చెమటతో నీరు మాత్రమే కాదు, లవణాలు కూడా బయటకు పోతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవటం ముఖ్యం. లేకపోతే ఒంట్లో నీటి శాతం, లవణాల మోతాదులు తగ్గిపోయి నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణ వంటి సమస్యలు మొదలవుతాయి.
నీరు మరీ తగ్గితే తీవ్రమైన వడ దెబ్బకూ దారి తీస్తుంది. ప్రాణాపాయమూ సంభవించొచ్చు. పిల్లలు, వృద్ధులు, ఎండను తట్టుకోలేని వారు, ఏసీ గదుల్లో గడిపే వారు, శారీరక శ్రమ అంతగా చేయని వారికి ఈ వేడి సమస్యల ముప్పు ఎక్కువ. కాబట్టి వీటి గురించి తెలుసుకొని, అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. చికత్స కంటే నివారణే మేలన్నట్లు.. వడ దెబ్బ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆనారోగ్యానికి గురైనప్పుడు చేపట్టాల్సిన చర్యల గురించి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చక్రపాణితో ప్రత్యేక ముఖాముఖి..