yoga day celebrations in khammam : ఖమ్మంలో యోగా దినోత్సవం.. పాల్గొన్న కలెక్టర్ గౌతమ్ - Telangana latest news
yoga day celebrations in khammam : రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో యోగా సాధన నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధనకు ప్రజలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పటేల్ స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ యోగా చేశారు. పతాంజలి యోగా పీఠ్ ఆధ్వర్యంలో పెవిలియన్ మైదానంలో యోగా వేడుకలు నిర్వహించారు. నడక సాధకులతో పాదం సంస్థ యోగా సాధన చేయించారు.
భారతీయ సంస్కృతిలో యోగా ఒక వరమని.. దీనిని ప్రపంచ దేశాలు అచరిస్తున్నాయని పతంజలి యోగా పీఠ్ సంస్థ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేస్తే మంచి జీవితాన్ని పొందొచ్చని సూచించారు. యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొన్నారు. రోజు గంటపాటు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. యాంత్రిక జీవనంలో విసిగివేసారే వారికి యోగా ఉపశమనాన్ని కలిగిస్తుందని వివరించారు. రోజు యోగా చేయడం ద్యారా ఎన్నో ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయన్నారు.