తెలంగాణ

telangana

Hyderabad Ganesh Immersion 2023

ETV Bharat / videos

Hyderabad Ganesh Immersion 2023 : జైజై గణేశా.. బైబై గణేశా.. చిత్రా లే అవుట్ కాలనీలో ఘనంగా వినాయక నిమజ్జనం - చిత్రా లేఅవుట్‌ గణేష్ నిమజ్జనం

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 10:50 AM IST

Hyderabad Ganesh Immersion 2023 : రాష్ట్రవ్యాప్తంగా గణేశ్​ నిమజ్జనాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా తీన్మార్​ బ్యాండ్​, డీజే సౌండ్​లు.. భక్తుల నృత్యాలతో సందడి వాతావరణం కనబడుతోంది. హైదరాబాద్ ఆర్​కేపురం పరిధిలోని చిత్రా లేఅవుట్‌లో 16ఏళ్లుగా ఏర్పాటు చేస్తున్న మట్టి గణపతి ఈ సారి కూడా ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణపై చిన్న పిల్లలకు, కాలనీవాసులకు అవగాహన కల్పిస్తూ..అపార్ట్‌మెంటు వాసులంతా ప్రతి ఏడాది ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

చిత్రా లేఅవుట్‌ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 11 రోజులపాటు పూజలందుకున్న గణపయ్యను సరూర్​నగర్ చెరువులో నిమజ్జనానికి అపార్ట్‌మెంటు వాసులంతా కలిసి ఆటాపాటలతో ఘనంగా సాగనంపారు. ప్రతి పండుగను కాలనీవాసులంతా కలిసి పండగ వాతావరణంలో జరుపుకుంటామని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల నగేశ్ అన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా మట్టి గణపతికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జనాన్ని ఎంతో వైభవంగా జరుపుకున్నామని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details