తెలంగాణ

telangana

బాక్సుల కొద్దీ యాపిళ్లను కాలువలో పారబోసిన రైతు

ETV Bharat / videos

బాక్సుల కొద్దీ యాపిళ్లను కాలువలో పారబోసిన రైతు.. కారణమిదే! - వైరల్ వీడియోలు

By

Published : Jul 30, 2023, 8:38 PM IST

Himachal Gardeners Threw Apples Into Drain : హిమాచల్​ప్రదేశ్​లోని శిమ్లా జిల్లాకు చెందిన ఓ రైతు.. బాక్సుల కొద్దీ యాపిళ్లను కాలువలో పారబోశాడు. ఓ వాహనంలో యాపిళ్ల బాక్సులను తీసుకువచ్చి.. నీటిలో పడేశాడు. రామ్​పుర్ పరిధిలోని ​బలసన్‌ అనే గ్రామానికి చెందిన రైతు.. స్థానికంగా పారుతున్న చిన్న కాలువలో ఇలా యాపిళ్లను పారబోశాడు. గత కొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్​లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా మటుకు రోడ్లన్ని దెబ్బతిన్నాయి. కొండచరియలు కూలి రోడ్లపై పడ్డాయి. తద్వారా రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. కారణంగా సకాలంలో మార్కెట్​కు యాపిళ్లను తీసుకెళ్లలేక పోవడం వల్ల అవి కుళ్లిపోయాయి. దీంతో వాటిని ఆ రైతు కాలువలో పారబోశాడు.

ప్రస్తుతం ఈ అంశం హిమాచల్​ ప్రదేశ్​లో రాజకీయ రగడకు దారితీసింది. యాపిల్​ రైతులకు సరైన సదుపాయలు కల్పించడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాంటి దేమిలేదని అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కాగా వీలైనంత త్వరగా రోడ్ల పనరుద్దణను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులు సమస్యలు తీరుస్తామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details