తెలంగాణ

telangana

వడగండ్ల వర్షం

ETV Bharat / videos

ఇది వడగండ్ల వర్షమా.. లేక గన్ ఫైరింగా..? - కుత్బుల్లాపూర్​లో వడగండ్ల వర్షం

By

Published : Mar 18, 2023, 10:55 PM IST

Heavy Hailstorm In Kukatpally: గత రెండు రోజుల నుంచి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రం మొత్తం తడిసి ముద్దవుతోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతుంటే.. మరికొన్ని చోట్ల తీవ్రస్థాయిలో వడగండ్లతో వర్షాలు పడుతున్నాయి. వికారాబాద్​లో కురిసిన భారీ వడగండ్ల వాన కశ్మీర్​లో కురిసే మంచు తుఫానును గుర్తు చేస్తే.. నేడు కూకట్​పల్లిలో కురిసిన వడగండ్ల వర్షం పాత విఠలాచార్య సినిమాలలోని బీభత్సాన్ని గుర్తు చేసింది. ఎవరో ఆకాశం నుంచి పెద్ద పెద్ద రాళ్లుతో దాడితో.. బుల్లెట్లతో దాడి చేస్తున్నట్లు.. అచ్చం విఠలాచార్య సినిమాలలో చూసే విధంగా వడగండ్లు పడ్డాయి. అవి పడినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరూ లేన్నందున సరిపోయింది లేకపోతే.. పెను ప్రమాదమే జరిగేది. ఇంకా నగరంలోనే కుత్బుల్లాపూర్​లో అయితే భారీ వర్షంతో పాటు వడగండ్ల వాహనదారులను, రోడ్లుపై నడిచే వారిని ఇబ్బంది పెట్టాయి. మునుపెన్నడూ చూడలేని విధంగా ఈసారి భారీస్థాయి వడగండ్ల పడడంపై  నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details