తెలంగాణ

telangana

Kadem project

ETV Bharat / videos

Kadem Project Water Level : శాంతించిన కడెం జలాశయం.. ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం - కడెం ప్రాజెక్టు 16గేట్ల ఎత్తి నీరు విడుదల

By

Published : Jul 27, 2023, 10:15 PM IST

Kadem Project in Nirmal : ప్రమాదపు అంచుల వరకు వెళ్లిన నిర్మల్​ జిల్లాలోని కడెం జలాశయానికి.. వరద పోటు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం ఎగువ నుంచి 3 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద చేరడంతో గేట్లపై నుంచి కూడా వరద నీరు ప్రవహించింది. దీంతో ప్రమాద స్థాయికి చేరిన ప్రాజెక్టులో నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తున్నారు. మధ్యాహ్నం వరకు నాయకులు, అధికారులు, అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో గడిపారు. ఆ తర్వాత నుంచి వరద ప్రభావం కాస్త తగ్గడంతో.. నీటి మట్టం స్థాయికి మించిన నీరు ఐదు అడుగులకు చేరింది. దీనికి తోడు మొరాయించిన నాలుగు గేట్లలో 2 గేట్లను ఇంజినీర్లు తెరిచారు. రాత్రి 7 గంటల సమయానికి 700 అడుగులకు గానూ.. 694 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 1 లక్ష 70 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఉదయం 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు.. ప్రస్తుతం 16 గేట్ల ద్వారా 2 లక్షల 18 వేల క్యూసెక్యుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details