అసైన్డ్ భూములకు పట్టాలు కావాలంటే కారు గుర్తుకు ఓటేయండి : హరీశ్‌రావు - నర్సాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం
Published : Nov 16, 2023, 7:30 PM IST
Harish Rao Speech at Narsapur Meeting : రూ.200 ఉన్న పింఛన్ రూ.2 వేలకు పెంచామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే పింఛను రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు. సన్నబియ్యం కావాలంటే భారత్ రాష్ట్ర సమితికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీశ్‌రావు ఈ మేరకు మాట్లాడారు.
BRS Election Campaign in Narsapur : ఈ సందర్భంగా మరోసారి అధికారంలోకి వస్తే సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేశామని.. హైదరాబాద్‌లో 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబాలకు వారంలోపు రూ.5 లక్షలు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మూడోసారి బీఆర్ఎస్ గెలిస్తే ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.