రాళ్ల వర్షం ఎప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో చూసేయండి
Hail rain at yellandu in Bhadradri district: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలంలోవు పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు భయందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం తెల్లవారుజాము వరకు వడగండ్ల వాన విజృభించింది. తుపాకీ బుల్లెట్ల శబ్దంలాగా వడగండ్లు కురవడంతో.. రేకులు ఇళ్లు, తాటి ఆకులతో పైకప్పు వేసుకొని జీవనం సాగిస్తున్న వారు కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సిమెంట్ రేకులతో వేసిన షెడ్లపై పెద్ద పెద్ద వడగళ్లు పడటంతో రేకులు దెబ్బతిన్నాయి.
ఇప్పటికే మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు జిల్లాలోని రైతన్నలు తీవ్రంగా నష్టపోగా.. తాజా వర్షంతో మామిడి పంట నేలరాలింది. చెట్లకు ఉన్న మామిడిపై వడగండ్లు పడటంతో దెబ్బతిని కాయలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షాలకు మరికొద్ది రోజుల్లో చేతికి రాబోయే.. వరి, మొక్కజొన్న, బొబ్బాయి, మిరప, పెసర, మినప పంటలు నెలకొరిగాయి.