తెలంగాణ

telangana

Students

ETV Bharat / videos

Govt School Students Visit Legislative Council : శాసన మండలిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సందడి - తెలంగాణ న్యూస్

By

Published : Aug 5, 2023, 7:17 PM IST

Govt School Students Visit Legislative Council : పాఠశాలలో చదివే విద్యార్థులను పెద్దయ్యాక ఏం అవుతావ్​ అంటే ప్రతి విద్యార్థి డాక్టర్, ఇంజినీర్​ అవతామంటారే తప్ప.. నేను రాజకీయనేతను అవుతాను.. ప్రజాసేవ చేస్తానని మాత్రం అనరు. దానికి కారణం వారికి రాజకీయాల పట్ల అవగాహన లేకపోవడమే. ఈ క్రమంలోనే తెలంగాణలో చదివే పాఠశాల విద్యార్థులకు రాజకీయాలు, శాసన సభ, మండలి పట్ల అవగాహన కల్పించడానికి ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను శాసన మండలి సందర్శనకు తీసుకెళ్లారు. ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవిలు విద్యార్థులకు స్వాగతం పలికి.. మండలి పనితీరును వివరించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలికి వచ్చిన విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు శాసనమండలి పని తీరును తెలుసుకోవడం వల్ల ప్రజాసేవపై ఆసక్తి పెరుగుతుందని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. భవిష్యత్‌ రాజకీయాలపై విద్యార్థులకు ఆసక్తి, అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పిల్లలు చాలా యాక్టివ్​గా అన్ని విషయాలను తెలుసుకుంటున్నారన్నారు. వారికి ప్రజాసేవ పట్ల అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details