నన్ను ఆ విషయంలో హేళన చేశారు: గవర్నర్ తమిళి సై - తెెలంగాణ తాజా వార్తలు
రాజ్‌భవన్‌లో ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళసై, హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలలో గవర్నర్ తమిళిసై యువతను ఉద్దేశించి ఉపన్యసించారు. భారతదేశ భవిష్యత్తుకు యువతే మూలస్థంబాలని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి యువ శక్తిని మహాశక్తిగా ఆమె అభివర్ణించారు. అనేకమంది యువకుల బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు. యువకులు అనేక సవాళ్లను స్వీకరించి ముందుకెళ్లాలని గవర్నర్ తమిళసై పిలుపునిచ్చారు. 'గవర్నర్ గా కొత్తగా అవతరించిన తెలంగాణను ఎలా మానేజ్ చేస్తానని చాలా మంది వ్యతిరేకించారు. కానీ నేను ఒక గైనకాలజిస్టుని. పిల్లల్ని ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు. తెలంగాణ కూడా ఒక పుట్టిన బిడ్డే కాబట్టి నేను బాగా మానేజ్ చేయగలనని నమ్మాను.'అని గవర్నర్ ఉపన్యసించారు. ఉగాది పండుగ సందర్బంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 13 మంది యువకులను సన్మానించారు. ఈ వేడుకల్లో నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.