Gold Modak For Ganpati : గణపయ్యకు నైవేద్యంగా 'బంగారు' మోదక్.. కిలో రూ.16వేలు.. ఫుల్ డిమాండ్! - బంగారు మోదక్‌ల ధర
Published : Sep 22, 2023, 11:42 AM IST
Gold Modak For Ganpati :దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి నాడు తమ ఇంటికి వేంచేసిన బొజ్జ గణపయ్యకు రకరకాల నైవేద్యాలు సమర్పించి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు భక్తులు. ఒక్కో రోజూ ఒక్కో వంటకాన్ని గణనాథుడికి నివేదించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలోని నాసిక్‌లో లభిస్తున్న బంగారు మోదక్‌లు ప్రస్తుతం అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి.
Golden Modak In Nasik : 24 క్యారెట్ల బంగారు పూతతో తయారు చేసిన ఈ మోదక్‌లను కిలో రూ.16వేలకు అమ్ముతున్నారు నాసిక్ వర్తకులు. వీటితోపాటు రూ.1600కు వెండి మోదక్‌లు అందబాటులోకి తీసుకొచ్చారు. బంగారు, వెండి మోదక్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కిలోల మోదక్‌లను అమ్మినట్లు వెల్లడించారు. బంగారు, వెండి మోదక్‌లతో పాటు బటర్‌స్కాచ్, చాక్లెట్, మామిడి పండు ఫ్లేవర్ మోదకాలు, డ్రై ఫ్రూట్స్ మోదకాలు, కుంకుమపువ్వు మోదకాలు, మలై మోదకాలు వంటి వివిధ రకాల నైవేద్యాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.