తెలంగాణ

telangana

Former Minister Son Vikram Goud Resigned BJP

ETV Bharat / videos

ఆత్మగౌరవం చంపుకుని పార్టీలో కొనసాగలేకే బీజేపీకి రాజీనామా: విక్రమ్‌గౌడ్‌

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2024, 7:00 PM IST

Former Minister Son Vikram Goud Resigned BJP :పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. మాజీమంత్రి ముఖేశ్​ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో విక్రమ్‌గౌడ్‌ ఆ పార్టీపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్న కొందరు నాయకులు, కార్యకర్తలను ఎదగనివ్వడం లేదని ఆరోపించారు. ఆత్మ గౌరవం చంపుకుని పార్టీలో కొనసాగలేకే బీజేపీకి రాజీనామా చేశానన్నారు. తన సొంత గూడైన కాంగ్రెస్‌లోకే వెళ్తున్నానని స్పష్టం చేశారు.

Vikram Goud Joins in Congress : మూడున్నరేళ్ల నుంచి బీజేపీ బలోపేతానికి కృషి చేశానని, ఆ పార్టీలో ఉన్న కొత్త వారిని అంటరాని వారీగా చూస్తున్నారని విక్రమ్‌గౌడ్‌ ఆరోపించారు. తన రాజీనామా లేఖను ఇప్పటికే కిషన్‌రెడ్డికి పంపించానని తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో పదవి ఉన్నా లేకున్నా కార్యకర్తగానైనా కొనసాగుతానని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారందరూ తిరిగి హస్తం గూటికే రావాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details