తెలంగాణ

telangana

'భవిష్యత్ కార్యాచరణ అనేది కాలం నిర్ణయిస్తుంది'

ETV Bharat / videos

నా భవిష్యత్ కార్యాచరణ కాలమే నిర్ణయిస్తుంది : జూపల్లి - తెలంగాణ తాజా రాజకీయ వార్తలు

By

Published : Apr 11, 2023, 12:45 PM IST

former minister jupally krishnarao interview: బీఆర్​ఎస్ పార్టీ వేటు అనంతరం మొదటిసారిగా తన నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తన భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడారు. 'భవిష్యత్ కార్యాచరణ అనేది కాలమే నిర్ణయిస్తుంది. నిరంజన్ రెడ్డి నిన్న సుదీర్ఘంగా వారి మేధా శక్తినంతా ఉపయోగించి దాదాపుగా గంటసేపు మాట్లాడారు. దానికి సవివరంగా పాయింట్ టూ పాయింట్ ప్రతి అంశానికి సంబంధించి కూడా చెబుతాము.' అని అన్నారు.

'నాలోపల సందిగ్ధత లేదు. మా కార్యకర్తల్లోనూ సందిగ్ధత లేదు. ఎందుకంటే ప్రజల భవిష్యత్తే మా భవిష్యత్. అలాంటప్పుడు మా భవిష్యత్ కాబట్టి సందిగ్ధత భవిష్యత్ సమస్య ఎందుకొస్తుంది? కొత్తగా పార్టీ పెట్టడం, వేరే పార్టీలో చేరడం లాంటి వాటికి సమయమే సమాధానం చెబుతుంది. సమయం వచ్చింది సమాధానం చెప్పాము. తెలంగాణ రాష్ట్రం సాధించాము. తర్వాత ఏం చేయబోతున్నాం అనే దానికి సమయమే సమాధానం చెబుతుంది.' అని జూపల్లి చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details