ప్రభుత్వ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ - 16 మందికి విద్యార్థినులకు అస్వస్థత - 16 మంది విద్యార్థినులకు అస్వస్థత
Published : Dec 4, 2023, 2:03 PM IST
Food Poison At Chevella Government School : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఓరేళ్లలోని గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా 16 విద్యార్థినులు వాంతులు విరోచనాలు చేసుకున్నారు. భయాందోళనకు గురైన విద్యార్థులు వార్డెన్‌కు తెలియజేశారు. వార్డెన్ వెంటనే విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై హాస్టల్లో పని చేసేవారిని ఆరా తీయగా ఆదివారం కావడంతో పిల్లల తల్లిదండ్రులు వచ్చి తినిపించారని, దానివల్లే ఫుడ్ పాయిజన్ అయిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినులంతా చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఈ మధ్యకాలంలో తరచూ ప్రభుత్వ హాస్టల్స్‌లో యజమాన్య నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని వసతి గృహాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తల్లిదండ్రులను వదిలి మంచి చదువుల కోసం కష్టమైనా వసతి గృహాల్లో ఉంటున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల పిల్లల ఆరోగ్యానికి హాని జరుగుందని తల్లితండ్రులు వాపోతున్నారు.