తెలంగాణ

telangana

బంధువుల ఉత్సాహంతో పెళ్లిమండపంలో చెలరేగిన మంటలు

ETV Bharat / videos

fire broke out at wedding : బంధువుల ఉత్సాహంతో పెళ్లిమండపంలో చెలరేగిన మంటలు - telangana latest news

By

Published : May 16, 2023, 4:52 PM IST

fire broke out at wedding in basar nirmal district : నిర్మల్ జిల్లా బాసరలోని  జ్ఞానసరస్వతి కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. పెళ్లి వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో టెంటుకు నిప్పంటుకుంది. దీంతో 4 ద్విచక్ర వాహనాలతో పాటు కుర్చీలు కాలిపోయాయి.  

స్థానికుల వివరాల ప్రకారం తెలంగాణ సరిహద్దు గ్రామమైన మహారాష్ట్రలోని జప్లాపూర్ గ్రామానికి చెందిన వారు బాసరలోని జ్ఞాన సరస్వతి కల్యాణ మండలంలో వివాహ వేడుకలను జరిపించారు. వరుడు వధువు మెడలో తాళి కట్టడం పూర్తి కావడంతో బంధువులు సంతోషంతో మండపం బయట వేసిన టెంట్ సమీపంలో బాణసంచా కాల్చారు. దీంతో టెంట్​పై నిప్పు రవ్వలు పడి నిప్పంటుకుంది. స్థానికులు గమనించి మంటలను ఆర్పేసే ప్రయత్నం చేశారు. ఈ మంటల్లో అక్కడ పార్కింగ్ చేసిన 4 ద్విచక్రవాహనాలు, కూర్చోడానికి వేసిన కుర్చీలు కాలిపోయాయి. బంధువులు అందరూ టెంట్ కింద కాకుండా పెళ్లి మండపంలో ఉండడంతో ఎవరికి ఎలాంటి హాని కలుగలేదు. సుమారు మూడు లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details